నాగబాబు అలా చేసేదంతా ఇందుకోసమేనా....!

SMTV Desk 2019-02-08 18:24:27  Pawan kalyan, Janasena party chief, Nagababu, Trolled, YS Jagan, Balakrishna

హైదరాబాద్, ఫిబ్రవరి 08: రాజకీయాలు అన్నాక ఒకరిని ఒకరు విమర్శించుకోవడం సహజమే కాని రాజకీయాల్లోకి నూతనంగా ప్రవేశించిన వారికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కొన్నేళ్ళకి అదే అలావాటు అయిపోతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్తితి కూడా అలాగే ఉంది. కాని ఇక్కడ కొంచెం డిఫరెంట్. ఎవరైనా పవన్ ని ఏమైనా అంటే అతని అభిమానులు వారిని టార్గెట్ చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే తన పాలిటిక్స్ లో ఎన్ని ఓడు దుడుకులు ఎదురైనా ఒంటరిగానే పోరాటం చేస్తానని చెప్పిన పవన్ కు ఇప్పుడు ఇతర వర్గాల నుంచి ఎక్కువగా మద్దతు అందుతోంది. అయితే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి నాగబాబు విమర్శల డోస్ గట్టిగా పెంచుతూ పవన్ కు సపోర్ట్ గా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ కాంట్రవర్సీ జరిగినా అందులో నాగబాబు కామెంట్స్ కూడా ఉంటున్నాయి.

శ్రీ రెడ్డి కామెంట్స్ తరువాతే నాగబాబు తన మాటలకు పదును ఎక్కువగా పెంచారని చెప్పాలి. బాలకృష్ణ నుంచి చంద్రబాబు, జగన్ ల వరకు ఎవ్వరిని వదిలిపెట్టకుండా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఓ వార్నింగ్ లు కూడా యాడ్ చేస్తున్నారు. తనకు ఎన్నో సార్లును సాయం చేసిన తమ్ముడికి నేను ఇంతవరకు ఏమి చేయలేదని గతంలో చెప్పిన నాగబాబు ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఎవరుపడితే వాడు విమర్శలతో విర్రవీగుతున్నాడని పవర్ స్టార్ కు తన సరికొత్త ఆలోచనతో కౌంటర్ ఇస్తూ తనవంతు సాయిం చేస్తున్నాడని చెప్పవచ్చు. మరి ఈ సపోర్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..