హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేసీఆర్ తన మంత్రివర్గాన్ని ఈ నెల 10వ తేదీన విస్తరిస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. కాగా పలువురు సీనియర్ నేతలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం లేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చోటు దక్కే అవకాశాలు లేవని తెలుస్తుంది.అయితే పార్టీ పదవులు నిర్వహించే వారికి మంత్రి పదవులు ఉండవని కేసీఆర్ గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు మంత్రి పదవిని ఇవ్వకపోవచ్చునని సమాచారం.
ఇక తన మేనల్లుడు, సీనియర్ నేత హరీష్ రావుకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవని గట్టి ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఎక్కువగా కొత్తవాళ్లకు తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మొహమ్మద్ అలీని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాగా కేటీఆర్ ను తన వారసుడిగా నిలబెట్టే క్రమంలో హరీష్ రావును దూరం పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హరీష్ రావు పాత్ర తగ్గిస్తూ వస్తున్నట్లు సమాచారం.