ప్రపంచ కుబేరుడికి బెదిరింపులు...!

SMTV Desk 2019-02-08 15:47:57  Amazone CEO, Jeff Bezos, National Enquirer Media, Black mail

అమెరికా, ఫిబ్రవరి 08: అమెరికా దేశంలోని ఓ మీడియా సంస్థ ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బేజోస్‌ను బెదిరిస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. నేషనల్ ఎంక్వైరర్ అనే మీడియా సంస్థ బేజోస్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నది. తనకు సంబంధించిన రహస్య చిత్రాలు ఉన్నాయని, వాటిని పబ్లిష్ చేస్తామని మీడియా సంస్థ హెచ్చరిందని బేజోస్ అన్నారు.

గర్ల్‌ఫ్రెండ్‌కు పంపిన కొన్ని ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని అమెరికా టాబ్లాయిడ్ అంటోంది. వ్యక్తిగత ఫోటోలను బహిర్గతం చేయడం తనకు ఇష్టం ఉండదని, కానీ ఆ టాబ్లాయిడ్‌ను మాత్రం అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బేజోస్ చెప్పారు.

గత ఏడాది డిసెంబర్‌లో తన భార్య మెకంజీకు విడాకులు ఇస్తున్నట్లు బేజోస్ చెప్పారు. అయితే టెలివిజన్ యాంకర్ లారెన్ సాంచేజ్‌తో బేజోస్ డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.