స‌న్నీ లియోన్ ప్ర‌క‌ట‌న తొలగించాలి :గోవా ఎమ్మెల్యే

SMTV Desk 2017-08-02 16:45:36  Shipment carrier, Sunny Leones statement, Posters,Goa Assembly, Goa Congress MLA is Este France French Silva

గోవా, ఆగస్టు 2 : సర్కారు రవాణా రహదారి వాహనాల్లో సన్నీ లియోన్ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన పోస్టర్లు ఉండటంపై గోవా అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న `క‌దంబ ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్ప్‌` బస్సుల్లో స‌న్నీ లియోన్ న‌టించిన కండోమ్ ప్ర‌క‌ట‌న పోస్టర్‌లు ఉండటంతో, పిల్లలు, మహిళలు ప్రయాణించే ఈ బ‌స్సుల్లో ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌టంపై గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఈ ప్ర‌క‌టన‌ల వ‌ల్ల ప్రయాణికులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌టీ ఆడ్రూ ఫ్రాన్స్ సిల్వెయిరా అభ్యంత‌రం వ్యక్తం చేసారు. ఈ మేరకు వాటిని వెంట‌నే తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇకపై భ‌విష్య‌త్తులో ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌పై నిషేధం విధించాల‌ని ఆయ‌న హెచ్చరించారు.