పాల దుకాణంలో దారుణ హత్య...!

SMTV Desk 2019-02-08 12:38:20  kareem Nagar, Woman death, Theegala Palli gutta

కరీం నగర్, ఫిబ్రవరి 08: కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో దారుణం జరిగింది. ఓ మహిళను దుండగులు తలపై బండ రాయితో కొట్టి హత్య చేసారు. అపోలో రిచ్ ఆస్పత్రి పక్కన పాల దుకాణం షెడ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు.

దుండగులు మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆపై మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.