ఖమ్మంలో భూమి ప్రకంపన

SMTV Desk 2019-02-08 12:08:39  Khammam, Earth Quakes

హైదరాబాద్, ఫిబ్రవరి 08: ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఒకసారిగా భూమి కంపించడంతో అందరు భయభ్రాంతులకు గురయ్యారు. నిద్రలో ఉన్నవారంతా లేచి బయటకు పరుగులు పెట్టారు ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి 11:23 గంటలకు భూమి ఐదు సెకన్ల పాటు కంపించింది. కొత్తగూడెం, సుజాత నగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి.

భూమి కంపించడంతో బయటకు వచ్చిన ప్రజలు లోపలికి వెళ్లేందుకు భయపడ్డారు. రాత్రంతా జాగారం చేశారు. అయితే, అధికారులు మాత్రం అది భూకంపం కాదని, కేవలం చిన్నపాటి ప్రకంపనలేనని చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ వచ్చే అవకాశం లేదని ధైర్యం చెప్పారు.