'సామ్‌సంగ్‌' ఫోన్ల అమ్మకాల్లో 'బిగ్ సి' ఘనత....

SMTV Desk 2019-02-08 11:50:38  BIG C, Samsung mobiles, BIG C Founder, Samsung electronics south west Asia president, Samsung CEO, HC Hang, CMD Balu choudary

హైదరాబాద్, ఫిబ్రవరి 08: గురువారం హైదరాబాద్ లోని మొబైల్ రిటైల్ విక్రయరంగ నెం.1 సంస్థ బిగ్ సి మొబైల్స్ ను సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సౌత్‌ వెస్ట్‌ ఏసియా ప్రసిడెంట్‌, సీఈవో హెచ్‌.సి.హాంగ్‌ సందర్శించారు. భారతదేశంలోనే సామ్‌సంగ్‌ వారి మొబైల్‌ ఫోన్‌ల అమ్మకాలలో బిగ్ సి సంస్థ మూడవ స్థానంలో ఉన్న సందర్భంగా హెచ్‌.సి.హాంగ్‌ బిగ్ సి సంస్థ ఫౌండర్, సీఎండి బాలు చౌదరిని అభినందించారు. అంతేకాక సామ్‌సంగ్‌ ప్రవేశపెట్టిన ప్రతి మొబైల్‌ మోడల్‌ అమ్మకాలలో గత 16 సంవత్సరాలుగా బిగ్ సి సంస్థ తెలుగు రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలచింది.

ఈ సందర్భంగా బిగ్‌ సి సంస్థ ఫౌండర్‌, సీఎండి ఎం.బాలు చౌదరి మాట్లాడుతూ బిగ్‌ సి మొబైల్స్‌ ప్రారంభించినప్పటి నుంచి 16 సంవత్సరాలుగా సామ్‌సంగ్‌ పూర్తి సహకారం ఉండటం వల్లనే ఈ ఘనత సాధించామనీ, సామ్‌సంగ్‌ కంపెనీ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కొత్త మొబైల్స్‌ ఉత్పత్తుల అమ్మకాలతో మరిన్ని లక్ష్యాలను సాధిస్తామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో సామ్‌సంగ్‌ సిబ్బంది, బిగ్‌ సి డైరెక్టర్స్‌ వై.స్వప్నకుమార్‌, జి.బాలాజీ రెడ్డి, కైలాష్‌ లఖ్యాని పాల్గొన్నారు.