మళ్ళీ సెట్స్ పైకి 'వర్మ'

SMTV Desk 2019-02-08 11:38:52  Arjun Reddy, Vijay devarakonda, Varma, Tamil Remake, Dhruv, Director Bala

చెన్నై, ఫిబ్రవరి 08: తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాని వేరే భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించారు. ఇప్పటికే హిందీలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ హీరో హీరోయిన్ లుగా కబీర్ ఖాన్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇక తమిళంలో నిర్మాతలు నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ బాలా దర్శకత్వంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ అనే పేరుతో అర్జున్ రెడ్డి రీమేక్ ను రూపొందించారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తీ చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేసారు. ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు నిర్మాతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సినిమా చుసిన నిర్మాతలు అవుట్ పుట్ సరిగా రాలేదని భావించారు. ఆ సినిమా టీజర్ కి కూడా మంచి స్పందన రాలేదు. దీంతో ఇక లాభం లేదని సినిమా మొత్తాన్ని రేషూట్ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హీరో ధృవ ని మినహాయించి ముగత నటీనటులను సాంకేతిక నిపుణులను కూడా మార్చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.