కేసీఆర్ జన్మదినం సందర్భంగా సౌతాఫ్రికాలో చారిటీ డ్రైవ్

SMTV Desk 2019-02-08 11:32:33  KCR, Telangana state Chief Minister, Kalvakuntla chandrashekhar rao, TRS Southafrica charity drive, KCR Birthday

సౌతాఫ్రికా, ఫిబ్రవరి 08: టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శాఖ ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ జన్మదినం సందర్భంగా చారిటీ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికాలోని మూడు ప్రావిన్స్ లలో చారిటీ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఓ ప్రకటనలో తెలిపారు.

ఫిబ్రవరి 17న జోహన్నెస్‌బర్గ్ లోని లీమో గెట్‌స్వే సేప్టీ హోంలో, కేప్‌టౌన్‌ లోని 16 ఎడ్వర్డ్‌ రోడ్‌ ఒట్టేరి ప్రాంతంలో, డర్బన్ లోని రిజర్వాయర్‌ హిల్స్‌ ప్రాంతంలో అనాథ పాఠశాలలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన రోజూవారి ఉపకరణాలు, ఆహారం, పండ్లు అందించనున్నట్లు పేర్కొన్నారు.