మెట్రో స్టేషన్ లిఫ్ట్ లో ప్రేమికుల రాసలీలలు

SMTV Desk 2019-02-08 09:20:13  Hyderabad metro stations, Mtero station lifts, Lovers

హైదరాబాద్‌, ఫిబ్రవరి 08: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లు ఇప్పుడు ఇలా కూడా ఉపయోగపడుతున్నాయా? అని అనుకోవడం మానరు ఈ విషయం తెలిసిన తరువాత.

హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్టులు ప్రేమికులకు అడ్డాగా మారుతున్నాయి. నాలుగు వైపులా మూసుకుని ఉండే ఈ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్‌గా మారాయి. నగరంలో కాసింత ఏకాంతం కోరుకునే ప్రేమికులకు మెట్రో లిఫ్ట్‌లు ఓ అవకాశంలా కనిపిస్తున్నాయి

ఈ లిఫ్ట్‌లలో సీసీటీవీలు ఉన్నాయన్న సంగతిని గుర్తించని ప్రేమికులు ఆ కాస్త సమయంలోనే ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇటీవల ఈ సీసీటీవీ ఫుటేజీలను గమనించిన సిబ్బంది అందులోని దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు.

వెంటనే వాటిని పోలీసులకు అందించారు. అయితే లిఫ్ట్‌లలో ముద్దు - ముచ్చటలు కానిచ్చేస్తున్న వారంతా ఇంటర్, డిగ్రీ చదివే వారు కావడం గమనార్హం. ఇప్పుడీ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి .