భారత్ తో తలపడనున్న ఆస్ట్రేలియా జట్లు...

SMTV Desk 2019-02-08 09:06:15  India VS Australia, T20, ODI Series, Australian Team

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 08: ఈ నెల 20 నుండి భారత్-ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభం కానున్న టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్లను ఆస్ట్రేలియా(సీఏ) గురువారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ తో ఐదు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లతో తలపడనుంది. గాయం కారణంగా ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఈ పర్యటనకు దూరమయ్యాడు. కాగా, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌, పేసర్‌ పీటర్‌ సిడిల్‌లను సెలెక్టర్లు పక్కన పెట్టారు. గత నెలలో ఆస్ట్రేలియాలో.. భారత్‌తో సిరీసుల్లో పాల్గొన్న 11 మంది ఆటగాళ్లు పర్యటనకు ఎంపిక చేసిన 16మందిలో ఉన్నారు. ఈ పర్యటనలో భారత్‌ వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. టెస్ట్‌ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అయితే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ 1-1తో డ్రాగా ముగించింది. స్టార్క్‌ ఇటీవల కాన్‌బెర్రాలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌ చివరి రోజున గాయపడ్డాడు.

స్కానింగ్‌లో స్టార్క్‌ కండరాల్లో చీలిక కన్పిం చింది. అతను చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది, అతను భారత పర్యటనకు అందుబాబులో ఉండడు. మార్చిలో యూఏఈలో పాకిస్తాన్‌తో ఆడే వన్డే సిరీస్‌ వరకు స్టార్క్‌ అందుబాటులోకి వస్తాడని.. అని జాతీయ సెలెక్టర్‌ ట్రీవొర్‌ హాన్స్‌ ఒక ప్రకటన చేశాడు. సీనియర్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ కూడా గాయం కారణంగా భారత పర్యటనకు దూరమయ్యాడు. ఆరోన్‌ ఫించ్‌ టీ20, వన్డే జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 24న తొలి టీ20కి వైజాగ్‌ ఆతిథ్యమివ్వనుండగా, రెండో టీ20 27న బెంగళూరులో జరుగనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మార్చి 2న హైదరాబాద్‌లో, రెండో వన్డే మార్చి 5న నాగపూర్‌లో, మూడో వన్డే మార్చి 8న రాంచిలో, నాలుగో వన్డే మార్చి 10న మొహాలీలో, ఐదో వన్డే మార్చి 13న ఢిల్లిలో జరుగనుంది.


జట్టు:టీ20/వన్డే: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), పాట్‌ కమిన్స్‌, అలెక్స్‌ కేరీ, జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, నాథన్‌ కోల్టెర్‌-నైల్‌, పీటర్‌ హాండ్స్‌కోంబ్‌, ఉస్మాన్‌ ఖవాజా, నాథన్‌ లియాన్‌, షువాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జే రిచర్డ్‌సన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డిఆర్సీ షార్ట్‌, మార్కస్‌ స్టొయినెస్‌, ఆస్టన్‌ టర్నర్‌, ఆడం జంపా.