కెప్టెన్ భాధ్యతలు స్వీకరించనున్న ధోని...?

SMTV Desk 2019-02-07 21:45:28  Mahendra singh dhoni, Indian Cricketer, T20 Capten, BCCI, India VS Newzeland

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: టీం ఇండియా అద్బుతం, సంచలన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల మహి మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలు పట్టనున్నాడని సమాచారం. పూర్తి వివరాల ప్రకారం ప్రస్తుతం టీమిండియా కివీస్‌తో ట్వంటీ-20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ పూర్తయ్యాక ఆస్ట్రేలియాతో టీమిండియా క్రికెట్ సిరీస్ వుంది. ఇందులో రెండు టీ-20 పోటీలు, ఐదు వన్డే క్రికెట్ మ్యాచ్‌లతో కూడిన సిరీస్ జరుగనుంది. దీనికి తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆపై వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఇలా వరుసగా క్రికెట్ సిరీస్‌లతో టీమిండియా క్రికెటర్లు బిజీ బిజీగా గడుపనున్నారు.

ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ కారణంగా త్వరలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు చోటు ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్ధంగా లేరు. ఈ ముగ్గురికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంకా ఆస్ట్రేలియాతో జరిగే టీ-20, వన్డే క్రికెట్ సిరీస్‌కు గాను యువ క్రికెటర్లను బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తోంది. వీరికి మంచి కెప్టెన్‌గా ధోనీని బరిలోకి దించి తిరిగి టీమిండియా పగ్గాలను మహీకి ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఆసీస్ పసికూనగా ఈ సిరీస్‌లో బరిలోకి దిగనుంది. ఇదే తరహాలో టీమిండియా యువక్రికెటర్లకు సలహాలిచ్చేందుకు ధోనీ సరిపోతాడని ధోనీ కెప్టెన్సీలో యువక్రికెటర్లకు మంచి అనుభవం లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది.