మధులిక హత్య కేసు : కీలక విషయాలు బయటపెట్టిన నిందితుడు

SMTV Desk 2019-02-07 20:41:23  madhulika, bharath, love afair, police case, police intragation

హైదరాబాద్, ఫిబ్రవరి 7: నిన్న హైదరాబాద్ లోని బర్కత్ పురాలో మధులిక అనే ఇంటర్ అమ్మాయిపై భరత్ అనే యువకుడు కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో నిందితుడు కీలక విషయాలు బయట పెట్టాడు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు నిజాల నిగ్గు తేలుస్తున్నారు.

నిందితుడు పక్కా ప్లాన్ తోనే మధులికపై దాడి చేశాడని పోలీసులు దర్యప్తులో తేల్చారు. ఆమెను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చాకే.. భరత్ కొబ్బరిబోండాల కత్తితో దాడి చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా ఇంకా మధులిక పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు కొన్ని సర్జరీలు అవసరమని తేల్చిన యశోదా ఆసుపత్రి వైద్యులు ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.