రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్సిల్..

SMTV Desk 2017-08-02 15:11:43  RAAMAANAYUDU STUDIO, ABROAD PAARSIL

హైదరాబాద్, ఆగష్టు 2 : డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మరింత నిఘా పెంచింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పార్సిళ్లపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో విదేశాల నుంచి రామానాయుడు స్టూడియోకు ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ గురించి ఆరా తీసేందుకు ఎక్సైజ్ సీఐ కనకదుర్గ అక్కడి వెళ్లి పరిశీలించగా, ప్రముఖ నటుడు దగ్గుపాటి రానా వెన్ను నొప్పికి సంబంధించిన ఓ పరికరాన్ని తెప్పించుకున్నాడని నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు.