రేపు జరిగే రెండో టీ20 లో కీలక మార్పులు...ముగ్గిరిపై వేటు...?

SMTV Desk 2019-02-07 19:54:10  India VS Newzeland, T20, BCCI, ICC, Indian Cricketers, krunal pandya, Khaleel ahmed, Vijay shankar

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: బుదవారం భారత్-న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీంఇండియాకు గట్టి దెబ్బే తగిలింది. న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకి టీ 20 మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ విభాగంలోనూ ఘోరంగా విఫలమై ఆతిథ్య జట్టు చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఏకంగా 80 పరుగల తేడాతో ఓడిపోయి భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండో టీ20 లో మరోసారి అలాంటి పొరపాటు జరకుండా వుండేందుకు టీంఇండియా మేనేజ్ మెంట్ సిద్దమయ్యింది, అందుకోసం జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం వుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి టీ20 లో భారత బౌలర్ల డొల్లతనం బయటపడింది.





కివీస్ బ్యాట్ మెన్స్ ని జోరును భారత బౌలర్లు అడ్డుకోలేకపోవడంతొ భారీ స్కోరు సమోదయ్యింది. దీంతో రెండో టీ20లో ఒకరిద్దరు బౌలర్లపై వేటు పడనుందని తెలుస్తోంది. వెల్లింగ్టన్ టీ20 మ్యాచ్ లో విఫలమైన ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రెండో టీ20కి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కృనాల్ మొదటి టీ20 లో 4 ఓవర్లేసి 1 వికెట్ మాత్రమే పడగొట్టి 37 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ లో మిగతా వాళ్లతో కాస్త పరవాలేదనిపించినా అతడిపై వేటు పడే అవకాశం వుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. అతడు మొదటి టీ20లో 4 ఓవర్లేసి ఏకంగా 48 పరుగులు సమర్పించుకుని కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో ఖలీల్ కు శుక్రవారం జరగనున్న రెండో టీ20 తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం బౌలింగ్ విభాగంలోనే కాకుండా వెల్లింగ్టన్ టీ20 లో భారత్ బ్యాటింగ్ లో కూడా విఫలమైంది. దీని ప్రభావం వల్ల భారత బ్యాటింగ్ విభాగంలొ కూడా మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విజయ్ శంకర్ ను రెండో టీ20 నుండి తప్పించే అవకాశం కనిపిస్తోంది. అలా కాని నేపథ్యంలో రిషబ్ పంత్, ధినేశ్ కార్తిక్ లలో ఎవరో ఒకరు జట్టుకు దూరం కానున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరి స్థానాల్లో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, సిద్దార్థ్‌ కౌల్ లకు రెండో టీ20 లో ఆడే అవకాశం లభించవచ్చు. ఇలా రెండో టీ20 గెలుపు కోసం భారత జట్టులో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.