‘చిత్రలహరి’పైనే పూర్తి ఆశలు...మిస్సైతే అంతే సంగతి

SMTV Desk 2019-02-07 19:21:04  Saidaram tej, Chitralahari movie, Mythri movie makers, Supreme movie, Devi sriprasad

హైదరాబాద్, ఫిబ్రవరి 07: గత కొద్ది సవత్సరాల నుండి ఒక్క హిట్ లేక వరుసగా ఆరు ఫ్లాప్ లతో ఒక్కసారిగా తలకిందులయ్యాడు మెగా హీరో సాయిదరంతేజ్. ‘సుప్రీమ్’ తరువాత సాయి ధరమ్ తేజ్ కి సరైన హిట్ ఒక్కటీ పడలేదు. అయితే ఈ ఫ్లాప్ ల ప్రభావం సాయి ధరమ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘చిత్రలహరి’ ఫై పడిందని సమాచారం. వారు బడ్జెట్ లో కోత పెట్టేసారట. వరుస హిట్లతో అతి తక్కువ సమయంలోనే తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గా పేరు తెచ్చుకున్న బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. అయితే ఈ బ్యానర్ కు గత ఏడాది చివరిలో రెండు భారీ ప్లాపులు తగిలి పెద్ద షాకే ఇచ్చాయి. దీంతో ఆ నిర్మాతలు తమ కొత్త సినిమాల నిర్మాణ విషయాలలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. హీరోల మార్కెట్ బట్టి చిత్ర బడ్జెట్ కేటాయించాలని, అంతకు మించి పైసా కూడా ఖర్చు పెట్టకూడదని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా సాయిదరంతేజ్ తో చేస్తున్న చిత్రలహరి బడ్జెట్ లో 5 కోట్లు తగ్గించారని ఫిల్మ్ నగర్ సమాచారం.

ముందుగా ఈ చిత్రానికి 20కోట్ల బడ్జెట్ అనుకున్నారట కాని తేజు మార్కెట్ చూసి 15కోట్ల వరకే కేటాయించేలా ఫిక్స్ అయ్యారట మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ఇక ఈసినిమా థియేట్రికల్ హక్కులను కూడా రీజనబుల్ రేట్స్ కు అమ్మి శాటిలైట్ , డిజిటల్ రైట్స్ తో లాభాలు రాబట్టాలన్న ఆలోచనలో వుంది మైత్రి. కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.