ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే మధులిక...

SMTV Desk 2019-02-07 19:15:17  madhulika, bharath, love afair

హైదరాబాద్, ఫిబ్రవరి 7: భరత్ అనే ప్రేమోన్మాది నిన్న హైదరాబాద్ లోని బర్కత్ పురాలో మధులిక(17) అనే ఇంటర్ అమ్మాయిపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధులికను యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే గం.24 లు గడిచిన మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా ఒక రోజు గడిస్తే గాని మధులిక పరిస్థితి ఏంటో చెప్పలేమని వ్యాఖ్యానించారు. గాయాల కారణంగా శరీరంలో ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

కాగా మధులిక ఇంటి దగ్గరలో ఉండే సి.భరత్‌(20) అనే యువకుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమించాలంటూ 2 సంవత్సరాలుగా అతడు మధులిక వెంటపడుతున్నాడు. ఇందుకు మధులిక అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న భరత్.. బాలికపై కొబ్బరి బొండాల కత్తితో నిన్న దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మధులిక చేతి వేళ్లు తెగిపోగా, ఎడమచేతికి, మెడకు, తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భరత్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు.