'83' కోసం కపిల్ దగ్గర రణ్ వీర్ కోచింగ్....

SMTV Desk 2019-02-07 18:38:19  Ranveer singh, Ammy Virk, Kabir Kha, Mohammed Zeeshan Ayyub, Jiiva, Kapil Dev

ముంభై, ఫిబ్రవరి 07: ఫిలిం ఇండస్ట్రీలలో ప్రస్తుతం బయోపిక్ ల హావా నడుస్తుంది. ప్రస్తుత ట్రెండ్, డైరెక్టర్ల మొదటి చాయిస్ బయోపిక్ లే. క్రీడలు, రాజకీయాం, సినీ రంగాల వారి ప్రముఖల జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కాగా అన్ని సినీ పరిశ్రమల దర్శకులు బయోపిక్ లను సక్సెస్స్ మంత్రంగా వాడుతున్నారు. చరిత్రలో ఒక పేజీని తెరపై అందంగా ఆవిష్కరిస్తే గుర్తింపుతో పాటు సినిమా వాళ్లకు డబ్బుల వర్షం కురుస్తుంది. ఇక ఒక పుస్తకం లాంటి చరిత్రనే స్క్రీన్ పైకి తేవాలంటే చాలా కష్టమైనా పని అని చెప్పవచ్చు. అయితే కపిల్ దేవ్ జీవితాన్ని ప్రధానంగా చేసుకొని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కబీర్ ఖాన్ 1983 వరల్డ్ కప్ పై మూవీ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 83 అనే టైటిల్ ను ఖరారు చేశారు సిని బృందం. ఇక 83 సినిమాలో ప్రతిసన్నివేశం ఒళ్ళు దగ్గరపెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1983లో భారత క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. సన్నివేశాలు రియలిస్టిక్ గా ఉండాలని నిజమైన లార్డ్స్ మైదానంలోనే సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు.

అయితే ప్రథమంగా బౌలింగ్ విషయంలో కపిల్ తరహాలో రణ్ వీర్ కనిపిస్తాడని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. కపిల్ దేవ్ హావభావాలను చూసి ఈ స్టార్ హీరో తనకు తాను 83 కపిల్ గా మార్చుకుంటున్నాడట. ఫిగర్ కరెక్ట్ గా స్క్రీన్ పై కనిపించే వరకు కపిల్ నుంచి పరీక్షలు ఆగవని చెబుతున్నాడు. కొన్ని వారాల నుండి కపిల్ దగ్గరే కోచింగ్ తీసుకుంటున్న రణ్ వీర్ ఆయన చెప్పినట్లు నిరంతరంగా ఒక ఓవర్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నాటి వరల్డ్ కప్ ని కూడా రణ్ వీర్ తదేకంగా ఎప్పటికప్పుడు మొబైల్ లో చూస్తూ అలవాటు చేసుకుంటున్నాడట. మరి అతని ఏకాగ్రత ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే సినిమా టీజరి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.