'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌' షూటింగ్ స్టార్ట్...

SMTV Desk 2019-02-07 16:36:54  Sandeep kishan, Hansika motwani, Director G Nageshwar reddy, Tenali ramakrishna BABL Movie

హైదరాబాద్, ఫిబ్రవరి 07: యువ హీరో సందీప్ కిషన్ హీరోగా జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా హన్సిక నటిస్తోంది. ‘గౌతమ్ నంద’ తరువాత హన్సిక చేస్తోన్న సినిమా ఇదే. కాగా ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే మొదలైనట్టు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ను ‘కర్నూల్’లో ప్లాన్ చేశారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగు జరగనుందట.

అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మిస్తున ఈ సినిమాలో ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ముర‌ళి శ‌ర్మ, పృథ్వీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సందీప్ కిషన్, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. హన్సిక కూడా తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తుంది. మరి వీరిద్దరి ఈ సినిమా ఎంత వరకూ కలిసొస్తుందో చూద్దాం.