స్పీకర్ ను పరామర్శించిన సీఎం..

SMTV Desk 2019-02-07 15:48:22  kcr, mp kavitha, pocharam srinivasa reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 7: తల్లి మరణంతో తీవ్ర దిగ్బ్రాంతిలో వున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈరోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బాన్స్ వాడకు వెళ్లిన కెసిఆర్, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోచారం గ్రామానికి వెళ్లారు. అనంతరం పోచారం శ్రీనివాస రెడ్డి తల్లి(107) పాపవ్వ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు.

కాగా సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఎంపీ కవిత, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు వెళ్లారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పాపవ్వ మంగళవారం రాత్రి కన్నుమూశారు. నిన్న ఆమె అంత్యక్రియలు నిర్వహించగ ఈరోజు కెసిఆర్ శ్రీనివాస రెడ్డిని పరామర్శించారు.