ఈడీ ఎదుట హాజరుకానున్న కార్తీ చిదంబరం

SMTV Desk 2019-02-07 14:55:39  INX media, Karthi Chidambaram, Chidambaram, Piter Mukharjiya, Indrani

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిక్కుకున్నా కార్తీ చిదంబరం విచారణ కొరకు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ కార్తీని ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు, ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించింది. కార్తీని రోజంతా ఈడీ ప్రశ్నించానున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన 10సార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. సుప్రీమ్ కోర్ట్ కార్తీని అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది. ఈడీ కార్తీని కార్తీ తండ్రి కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి కూడా హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో మరో నిందితురాలు, మీడియా టైకూన్‌ పీటర్‌ ముఖర్జియా భార్య ఇంద్రాణి అప్రూవర్‌గా మారాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కాగా, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో గత ఏడాది ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం అరెస్ట్ అయ్యారు. కార్తీ తండ్రి పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ లావాదేవీలు జరగడంతో ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కార్తీ మరిన్ని చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది.