టీజర్ తో యూత్ కి కనెక్ట్ అయిన 'లవర్స్ డే'

SMTV Desk 2019-02-07 12:58:14  Priya Prakash variar, Lovers day, teaser release

హైదరాబాద్, ఫిబ్రవరి 07: మలయాళం హీరోయిన్ ప్రియ ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ చిత్రం నుండి ఒక పాటని విడుదల చేసారు. ఈ పాటని ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. తాజాగా చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ఈ టీజర్‌ను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు ఒమర్‌ లులు దర్శకత్వం వహించారు.