జనసేనలోకి చేరిన మాజీ డీఐజీ

SMTV Desk 2019-02-07 12:48:58  Pawan Kalyan, Ravikumar Murthi, Ex. DIG, Janasena

అమరావతి, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోటాపోటిగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జనసేన పార్టీ పలు అభ్యర్థుల చేరికతో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా రిటైర్డ్ డీఐజీ టి.రవికుమార్ మూర్తి, తన భార్యతో కలిసి జనసేన తీర్ధం పుచ్చుకున్నాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. తరువాత రవికుమార్ మాట్లాడుతూ, తాను పోలీస్ శాఖలో 29 ఏళ్లు పనిచేశానని తెలిపారు. సమాజ సేవ చేయాలన్న లక్ష్యంతోనే తాము జనసేనలో చేరినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించడానికి పవన్ కల్యాణే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు.