రజినికాంత్ నెక్స్ట్ సినిమాపై '2.o'ప్రభావం

SMTV Desk 2019-02-07 12:16:41  Rajinikanth, Lyca Productions, '2.O', Rajinikanth remunaration

హైదరాబాద్, ఫిబ్రవరి 07: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాతో ఇటీవల మంచి హిట్ కొట్టాడు. దాని తర్వాత రజిని మురుగదాస్ దర్శకత్వం లో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమా కోసం రజిని తన పారితోషకాన్ని తగ్గించుకున్తున్నట్లు సమాచారం. దీనికి కారణం రజిని ముందు నటించిన సినిమా 2.o అని తెలుస్తోంది.

లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో 2.o సినిమాను నిర్మించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సినిమా మంచి వసూళ్ళని రాబట్టినప్పటికీ నిర్మాతలకు లాభం తెచ్చి పెట్టలేకపోయింది. రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. 2.o కి రజినీకాంత్ రూ.60 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. అందుచేత ఇప్పుడు నిర్మాతలకు భారం తగ్గించడానికి పారితోషకం తగ్గించుకోవాలనే యోచనలో రజినీకాంత్ ఉన్నాడని తెలుస్తోంది.