సమీకృత మార్కెట్ ను ప్రారంభించిన హరీశ్ రావు

SMTV Desk 2019-02-07 10:16:23  Harish Rao, Chandrasekhar Rao, KTR, Integrated Market, Siddipeta

హైదరాబాద్, ఫిబ్రవరి 07: తెలంగాణా రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ ను బుదవారం మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రారంభించారు. ఆ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, నిజాం కాలంలో హైదరాబాద్ లో నిర్మించిన మోండ మార్కెట్ ఇప్పటికి ఎంతో ఉపయోగకరంగా ఉందని, అలాంటి మార్కెట్లనే రాష్ట్రమంతా నిర్మించాలన్నది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆకాంక్ష అని తెలిపారు. అందువల్లనే సిద్ధిపేటలో మొదటగా నిర్మించమని పేర్కొన్నారు. ఈ ప్రారంబోత్సవ వేడుక ఫోటోలను హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా, వాటిని చూసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. "చాలా అద్భుతంగా ఉంది. నా అభినందనలు బావా" అని కామెంట్ చేశారు. ఈ మార్కెట్లో అత్యాధునిక సౌకర్యాలు, కూరగాయలు, మాంసం ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఇక కేటీఆర్ అభినందనల ట్వీట్ ను చూసిన హరీశ్ రావు "మెనీ థ్యాంక్స్" అని రిప్లయ్ ఇచ్చారు.