జగన్ ఒక సిద్ధాంతం లేని వ్యక్తి

SMTV Desk 2019-02-07 09:36:48  YS Jagan, Chandrababu, Samara Shankharavam, Bandar, port, Teleconference

అమరావతి, ఫిబ్రవరి 07: నిన్న తిరుపతిలో జరిగిన ఎన్నికల శంఖారావంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వృద్దులకు పింఛన్లను రూ. 3 వేలకు పెంచుతనని ఎన్నికల హమీ ఇచ్చారు. టిడిపి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ జగన్ ఒక సిద్ధాంతం లేని వ్యక్తి అని, ఆయన ఇచ్చే హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో దిక్కుతోచని జగన్ ప్రజలకు అనవసర హామీలు ఇస్తున్నాడని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీతో కలిసి జగన్ టిడిపిని దెబ్బకొట్టాలని చూస్తున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెలా 10న జరిగే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై నిరసన తెలపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా 11వ తేదీన ఢిల్లీలో పెద్దఎత్తున ధర్మపోరాట దీక్షను చేపట్టనున్నామని తెలిపారు. ఈ దీక్షకు ఎన్నో ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. అంతేకాకుండా బందరు పోర్టు నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు.