హర్షిత్ చేసిన గూగుల్ వార్త అవాస్తవం: గూగుల్

SMTV Desk 2017-08-02 14:06:16  Chandigarh, google, job, harshith, fake

చండీగఢ్, ఆగస్టు 2 : మీడియాకు కనిపించేందుకు గూగుల్ పై వార్తను చెప్పిన ఘటన చండీగఢ్ లో చోటుచేసుకుంది. చండీగఢ్ లో నివాసం ఉంటూ ఇంటర్ చదువుతున్నా 16 ఏళ్ల విద్యార్థి హర్షిత్ శర్మకు గూగుల్, తన డిజైనింగ్ టీమ్ లో సాలీనా రూ. 1.44 కోట్ల ఆఫర్ తో ఉద్యోగాన్ని ప్రకటించిన విషయంపై గత వారంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడా వార్త అవాస్తవమని గూగుల్ తేల్చి చెప్పింది. అసలు తమ వద్ద హర్షిత్ శర్మకు చెందిన రికార్డులేవీ లేవని, అతనికి ఆఫర్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. డిజైనింగ్ రంగంలో ఉపాధి పొందుతున్న హర్షిత్ ను గూగుల్ ఎంపిక చేసుకుని, నెలకు నాలుగు లక్షల రూపాయల ఉపకార వేతనంతో ఆగస్టులో అమెరికాకు పంపి శిక్షణ ఇవ్వనుందని, ఏడాది తరువాత నెలకు రూ. 12 లక్షల ఆఫర్ తో ఉద్యోగాన్ని ఆఫర్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని హర్షిత్ స్వయంగా మీడియాకు చెప్పి తన కల నిజమైందని అన్నాడు కూడా. గూగుల్ వివరణ అనే వంకతో మీడియాలో కనిపించేందుకే ఇలా తప్పుడు సమాచారాన్ని అతడు ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.`