బన్ని, త్రివిక్రమ్ మూవీ అప్ డేట్...

SMTV Desk 2019-02-06 20:40:44  Allu arjun, Trivikram srinivas, Harika and hassini, Aravinda sameta movie, Julayi movie, S/O Sathyamurthi movie

హైదరాబాద్, ఫిబ్రవరి 06: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి , s/o సత్యమూర్తి ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరోసారి వీరిద్దరూ కలిసి హాట్రిక్ కొట్టడానికి చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ నుండి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇదివరకు అల్లు అర్జున్ తీసిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా గతంలో ఎప్పుడూ లేని విధంగా డిజాస్టర్ కావడంతో కాస్త జాగ్రత్త పడుతున్నాడు స్టైలిష్ స్టార్. అటు త్రివిక్రమ్ అరవింద సమేత బ్లాక్ బస్టర్ తో మంచి ఫాంలో ఉన్నాడు. ఇక రీసెంట్ గా గీత ఆర్ట్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం.

పూర్తిగా నటీనటులను అలాగే ఇతర టెక్నీషియన్ టీమ్ ను సెట్ చేసుకొని అధికారికంగా టైటిల్ ను కూడా రిలీజ్ చేసేందుకు అల్లు అర్జున్ గ్యాంగ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ తో పాటు హారికా హాసిని క్రియేషన్స్ అల్లు అర్జున్ కొత్త చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్స్ విషయంలో కూడా ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సంగీత దర్శకుడిగా మరోసారి థమన్ ను త్రివిక్రమ్ ఎంచుకోబోతున్నట్లు టాక్. మొత్తంగా మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ ను మొదలెట్టి ఇదే ఏడాది సెప్టెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచేలా చిత్ర నిర్మాణ సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి.