'టెంపర్' రీమేక్ 'అయోగ్య' ట్రైలర్ రిలీజ్....

SMTV Desk 2019-02-06 20:25:12  Tempar movie, Ayogya movie, Ayogya teaser, Vishal, NTR, Puri jagannad

చెన్నై, ఫిబ్రవరి 06: తెలుగులో సంచలన దర్శకుడు పూరి జగన్నాద్ జూ. ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా టెంపర్ . ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ విశాల్ తమిళ్ లో రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే దీన్ని విశాల్ తమిళ్ లో అయోగ్య అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని బుదవారం రిలీజ్ చేశారు సినీ బృందం.

విశాల్ దాదాపు ఎన్టీఆర్ స్టైల్ ని ఫాలో అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో సింబా పేరుతో రిలీజైన టెంపర్ రీమేక్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు విశాల్ తమిళ్ టెంపర్ కథను అయోగ్యగా వదలబోతున్నాడు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.