మమతకి వార్నింగ్‌ ఇచ్చిన అమిత్ షా..

SMTV Desk 2019-02-06 19:54:45  amithsha, mamata banerjee, West Bengal, BJP

అలీగఢ్‌, ఫిబ్రవరి 06: అలీగఢ్‌లో ఈరోజు జరిగిన ర్యాలీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పచ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్న మమతా బెనర్జీ తన చర్యలతో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని అమిత్‌ షా హెచ్చరించారు. బెంగాల్‌లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఆమె బీజేపీ నేతలను అడ్డుకుంటున్నారని అన్నారు. బెంగాల్‌లో 42 లోక్‌సభ స్ధానాలకుగాను 23 స్దానాల్లో కమలం విచ్చుకొనే వరకు బీజేపీ కార్యకర్తలు విశ్రమించబోరని ఆమెకు తెలియదని స్పష్టం చేశారు.

కాగా బెంగాల్‌లో నిన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అనుమతించకుండా అడ్డంకులు సృష్టించారు..నా హెలికాఫ్టర్‌ ల్యాండయ్యేందుకు అనుమతించలేదు..శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రధాన మంత్రి సభకు చిన్న మైదానం కేటాయించి, దానికి అనుమతులు సైతం అర్ధరాత్రి ఇచ్చారని మమతా సర్కార్‌పై ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ సత్తా చాటనుందనే ఆక్రోశంతోనే దీదీ ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.