యు ట్యూబ్ లో 'అజ్ఞాతవాసి' హవా....

SMTV Desk 2019-02-06 15:59:56  Agnathavasi Movie, Pawan kalyan, Yevadu 3, Hindi Dubbed Movies, You tube, Allu arjun, Duvvada Jagannadham

హైదరాబాద్, ఫిబ్రవరి 06: టాలీవుడ్ లో కొన్ని సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచిన వాటిలో కొన్నింటిని హిందీలో డబ్ చేసి యు ట్యూబ్ లో పెడుతుంటారు. అయితే వాటిలో కొన్ని సినిమాలకు ఊహించని విధంగా వ్యూస్ వస్తూ వుంటాయి. తెర మీద విజయంసాధించలేని కొన్ని సినిమాలకు యు ట్యూబ్ లో మంచి ట్రెండ్ నడుస్తది. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాను హిందీలో ఎవడు 3 అనే టైటిల్ తో యూట్యూబ్ లో డబ్ చేసి పెట్టారు. అయితే ఈ డబ్ వెర్షన్ యూట్యూబ్ లో 76 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. అల్లు అర్జున్ ఫ్లాప్ సినిమా దువ్వాడ జగన్నాథం కి కూడా ఇదే రేంజ్ లో వ్యూస్ వచ్చాయి.

సాయి ధరం తేజ్ నటించిన డిజాస్టర్ చిత్రం జవాన్ కి కూడా 36 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యూస్ చూసుకుంటూ ఆయా హీరోల అభిమానులు సంబర పడిపోతున్నారు. థియేటర్లలో ఫ్లాప్ అయినా యూట్యూబ్ లో సినిమాలు హిట్లు అంటూ ఈ మిలియన్ వ్యూస్ పోస్టర్ లను షేర్ చేస్తున్నారు. అయితే ఈ వ్యూస్ కారణంగా హీరోలకు వచ్చే లాభం ఏం ఉండదు. ఎటొచ్చీ ఈ వ్యూస్ కారణంగా కాసిన్ని డబ్బులు మాత్రం సంపాదించుకుంటున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు.