బాధ్యతలు నిర్వర్తించింది నా కుమారుడే :లాలూ

SMTV Desk 2017-08-02 12:58:44  BJP, BIHAR CM NITHISHKUMAR, LALU PRASAD YADAV, TEJ PRATHAP, CBI,

పాట్నా, ఆగస్టు 2 : ఇటీవల బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆర్జేడీ కూటమి నుంచి విడిపోయిన నేపథ్యంలో లాలూ ఇంకా నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ట్విట్టర్ ద్వారా నితీష్ ప్రభుత్వం చేసిన తప్పులు, లోపాల గురించి ఆయన మాట్లాడుతూ, నితీష్ మంత్రి వర్గంలో తన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మినహా మిగతా మంత్రులందరూ తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని తెలిపారు. తన మరో కుమారుడు, బీహార్ ఆరోగ్య మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించక పోవడంతో, గత 20 నెలల్లో నితీష్ ప్రభుత్వం చెప్పిన గొప్ప పని ఒకటి కూడా లేదని ఆయన మండిపడ్డారు. ఆరోగ్య మంత్రిగా తేజ్ ప్రతాప్ పనితనం కూడా అంతంత మాత్రమే. ప్రతాప్ ప్రజల క్షేమం కన్నా సినిమాలో నటించడానికే ఎక్కువ సమయం కేటాయించడం, ప్రభుత్వ ఆస్తులను స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవడం లాంటి పనుల వల్ల తేజ్ ప్రతాప్ అధికారి దుర్వినియోగంగా పేరు తెచ్చుకున్నారు. మరో వైపు ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ బాధ్యతల నిర్వహణలో ఎలాంటి మచ్చ లేకున్నా, కొద్ది రోజుల క్రితం జరిగిన సీబీఐ దాడుల్లో ఆయన అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు నితీష్ ఆర్జేడీని వీడి భాజపాతో జతకలిశారు.