నాని సినిమాలో విలన్ గా 'RX100' హీరో...?

SMTV Desk 2019-02-06 15:46:58  Natural star Nani, Karthikeya Gummakonda, RX 100 Movie, Vikram K Director

హైదరాబాద్, ఫిబ్రవరి 06: RX 100 సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ. ఆ సినిమా తరువాత ఈ హీరోకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాని కేవలం హిప్పీ అనే సినిమా తప్ప మరే సినిమాను ఒప్పుకోలేదు. అయితే హీరోగా రెండు మూడు సినిమాలు కూడా చేయని కార్తికేయ ఇప్పుడు విల్లన్ గా చేస్తున్నాడంటా. నాచురల్ స్టార్ నాని విక్రం కే దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని ప్లే బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.

కథ ప్రకారం సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, మేఘాఆకాష్, ప్రియా ప్రకాష్ వారియర్ లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. మరో ఇద్దరిని వెతికే పనిలో పడ్డారు. అలానే విలన్ పాత్ర కోసం కార్తికేయను అనుకున్నప్పడు అతడు ఒప్పుకుంటాడా..? లేదా..? అనే సందేహంతోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ విన్న కార్తికేయ విలన్ రోల్ లో నటించడానికి చాలా ఎగ్జైట్ అయ్యాడట. దీంతో అతడినే విలన్ గా ఫైనల్ చేసుకున్నారు. సినిమా ట్రైలర్బయటకి వచ్చే వరకు కూడా కార్తికేయ పాత్రను సర్ప్రైజింగ్ గానే ఉంచాలని భావిస్తున్నారు.