నా జీవితంలోనే అవి దారుణమైన రోజులు...హీరో భార్య

SMTV Desk 2019-02-06 15:13:16  Ayushman Khurana, Tahira Kashyap Khurrana, World cancer day, Vicky donor movie, Andhadhun Movie, Badai Ho Movie

ముంభై, ఫిబ్రవరి 6: బాలీవుడ్ క్రేజీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా. విక్కీ డోనార్ సినిమా ఊహించని విధంగా వసూళ్లు రాబట్టడంతో ఒక్కసారిగా టాప్ రేంజ్ లోకెళ్ళాడు ఈ హీరో. ఆ తరువాత ఆయుష్మాన్ చేసిన సినిమాలు అన్ని హిట్ గా నిలిచాయి. గతేడాది వచ్చిన అంధాదూన్ , బడాయి హో సినిమాలు కూడా ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇదిలా ఉండగా ఆయుష్మాన్ సతీమణి తాహిరా కాన్సెర్ వ్యాధితో పోరాడుతుందని తన భర్త కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఖురానా భార్య తాహిరా. వరల్డ్ కాన్సర్ డే సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ టాప్ లెస్ బ్యాక్ ఫోటోని షేర్ చేసింది.

తాను క్యాన్సర్ చికిత్స చేయించుకున్న సమయంలో సర్జరీకి సంబంధించిన కత్తి గాట్లని చూపించేందుకు ఈ ఫోటో షేర్ చేశానని తెలిపింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే తాహిరాతో వివాహం జరిగింది. అతడు విక్కీ డోనార్ సినిమాలో నటిస్తోన్న సమయంలో తాహిరా గర్భవతి. అదే సమయంలో ఆమెకి బ్రెస్ట్ కాన్సర్ ఉందని తెలిసింది. ఆ సమయంలో తన భర్త, ఆమె మానసికంగా ఎంతో వేదనని అనుభవించినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆయుష్మాన్ ఖురానా ఎంతో భయపడ్డాడని, కనీసం తనకు ధైర్యం చెప్పే పరిస్థితిలో కూడా లేడని వెల్లడించింది. తన జీవితంలోనే అవి దారుణమైన రోజులని తెలిపింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొని కాన్సర్ ని జయించినట్లు స్పష్టం చేసింది.