'తిప్పరా మీసం' ఫస్ట్ లుక్ రిలీజ్

SMTV Desk 2019-02-06 14:51:41  Thippara meesam, Nidi Nadi Oke katha, Srivishnu, Krishna Vijay

హైదరాబాద్, ఫిబ్రవరి 06: హీరో శ్రీ విష్ణు తన కొత్త సినిమా తిప్పరా మీసం తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మెంటల్ మదిలో , నీదీ నాదీ ఒకే కథ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా ఆ చిత్రాలలో శ్రీవిష్ణు నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ హీరో ప్రతిసారి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే ఇప్పుడు కుడా కృష్ణ విజయ్ దర్శకత్వంలో తిప్పరా మీసం అనే సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేసారు. దీంట్లో హీరో శ్రీవిష్ణు టైటిల్‌కు తగ్గట్టుగా గుబురు గడ్డంతో మాస్‌లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ తో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. శ్రీవిష్ణు ఈ సినిమా తనకు ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. తిప్పరా మీసం సినిమా మార్చి 15న విడుదల కానుంది.