పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న బీజేపీ నేతను అరెస్ట్ చేసినా పోలీసులు

SMTV Desk 2019-02-06 14:33:52  Nikhil Ravi, Birthday Celebrations, BJP, Belagavi

బెంగళూరు, ఫిబ్రవరి 06: తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకున్నందుకు ఓ బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. బీజేపీ అనుబంధ సంస్థ యువమోర్చా బెళగావి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నిఖిల్ రవి తన అనుచరులతో కలిసి ఈ నెల 1న తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ నేపథ్యంలో పొడవాటి తల్వార్(కత్తి) తో పుట్టినరోజు కేకును కోశాడు. ఈ వేడుకకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఖిల్ రవిని అరెస్ట్ చేశారు. అనంతరం హిండల్గా జైలుకు పంపారు. కాగా, నిఖిల్ పై ఇప్పటికే రౌడీషీట్ తో పాటు 8 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.