అనుకున్నదోక్కటీ...అయినదోక్కటీ...బోల్తా పడ్డ రెజినా

SMTV Desk 2019-02-06 13:29:12  Regina, Sonam Kapoor, Anil Kapoor, Bollywood, Tollywood

హైదరాబాద్, ఫిబ్రవరి 06: టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలలో రెజినా ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఆమె వరుసగా సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోల సినిమాలలో అవకాశం దక్కించుకోలేక పోయింది. టాలీవుడ్ లో తన కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో రెజినాను బాలీవుడ్ ఆఫర్ వరించింది. దాంతో రెజినా కెరీర్ మలుపు తిరిగిందని అంతా అనుకున్నారు.

సోనమ్ కపూర్, అనిల్ కపూర్, జుహీ చావ్లా, రాజ్ కుమార్ రావు వంటి పెద్ద స్టార్ లతో ఏక్ లడఖీ కో దేఖా తో ఐసా లగా అనే సినిమాలో అవకాశం రెజినాను వరించింది. ఈ సినిమాలో సోనమ్ కపూర్ ప్రేయసి పాత్రలో రెజినా కనిపించింది. ఈ సినిమా లెస్బియన్ లవ్ నేపథ్యంలో రూపొందించబడింది. సినిమా విడుదలకు ముందు ప్రచార చిత్రాల్లో రెజినా పాత్ర గురించి బయటికి తెలియకుండా ఉంచారు. కానీ విడుదల తర్వాత కూడా ఆమె పాత్రకు గుర్తిపు రాలేదు. సినిమాలో రెజినా సన్నివేశాలు చాల తక్కువ ఉన్నాయు. అంతేకాక ఆమె పాత్రకు సినిమాలో అంత ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. దీంతో రెజినా బాలీవుడ్ ఆశలు ఆవిరైపోయాయి. దీంతో ఇటు తెలుగు సినిమాలలోను, అటు హిందీ సినిమాలలోను అవకాశాల్లేకుండ పోయాయి. ఆ మద్య రెండు అవకాశాలు వచ్చిన అవి కూడా ఇప్పుడు రెజినా చేయి దాటి పోయాయి.