గాంధీ బొమ్మను కాల్చిన పూజా పాండే అరెస్ట్

SMTV Desk 2019-02-06 12:25:05  Nathuram Gadse, Mahatma Gandhi, Pooja Pandey, Ashok Pandey, Luckow

లక్నో, ఫిబ్రవరి 06: భారత దేశ జాతి పిత మహాత్మా గాంధీని 1948, జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో హిందూ మహాసభకు చెందిన పూజా పాండే మహాత్మాగాంధీ వర్ధంతి రోజున మహాత్మాగాంధీ బొమ్మను తుపాకీతో కాల్చి కలకలం రేపారు. గాంధీ బొమ్మను కాల్చగానే, రక్తం కారేట్లుగా ఏర్పాటు కూడా చేశారు. అనంతరం వీరంతా కలిసి సంబరాలు చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలు దీనిపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లో ఉత్తరప్రదేశ్ పోలీసులు పూజా పాండే, ఆమె భర్త అశోక్ పాండేను అరెస్ట్ చేశారు. వీరిద్దరిని కోర్ట్ ముందు హాజరుపరచనున్నారు.