'భాగి 3' సినిమాను కాదనుకున్న కొత్త హీరోయిన్....!

SMTV Desk 2019-02-06 12:21:44  Sara Ali Khan, Saif Ali Khan, Tiger Shroff, Bhaaghi 3, Bollywood

ముంబై, ఫిబ్రవరి 06: సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. తర్వాత తన రెండో సినిమాకే స్టార్ హీరో రణవీర్ సింగ్ కి జోడిగా సింబా సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో రెండవ సినిమాతోనే సారా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటనకి బాలీవుడ్ లో మంచి మార్కులు పడ్డాయి.

ఈ సినిమా తర్వాత సారా బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అయితే ఇటీవల టైగర్ హీరోగా నటిస్తున్న భాగీ 3 సినిమా కోసం సారా అలీ ఖాన్ ను దర్శకనిర్మాతలు సంప్రదించగా, ఆమె ఆ సినిమా చేయడానికి తిరస్కరించినట్లు బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. తన బిజీ షెడ్యూల్ వల్ల సారా ఆ సినిమాను చేయలేకపోతున్నానని వెల్లడించారు. అయితే భవిష్యతులో ఎప్పుడైనా హీరో టైగర్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండ చేస్తానని ఆమె అన్నారు.