వలసదారులను హెచ్చరించిన ట్రంప్

SMTV Desk 2019-02-06 12:03:30  Donald Trump, Higher Education, Immigrants, Visa applicants, US Congress, Mexico

ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చే వారు ఎవరైనా, ఎక్కడి వారు అయిన ఇక్కడి నియమ నిబందాలను తప్పనిసరి పాటించాలని , ఎవరైనా తప్పుడు ఆధారాలతో, తప్పుడు మార్గాల్లో దేశంలోకి రావాలని చూసిన తీవ్రమైన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంళో పాల్గొన్న ట్రంప్ అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాగ, "గతంలో ఈ గదిలో ఉన్న వారంతా గోడ కట్టేందుకు అంగీకరించారు. అయితే, ఆ పని మాత్రం జరుగలేదు. నేను పూర్తి చేసి చూపిస్తాను" అని ఆయన అన్నారు. మెక్సికో సరిహద్దుల్లో 5.7 బిలియన్ డాలర్ల వ్యయంతో శాశ్వత సరిహద్దును నిర్మించాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అటు అధికార, ఇటు విపక్ష పార్టీల సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం స్తంభించింది. 35 రోజులకు పైగా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు కొందరు సీనియర్ ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. తాజా సంక్షోభానికి ట్రంప్ వైఖరే కారణమని 50 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడుతున్నట్టు రాయ్ టర్స్ వెల్లడించింది.