తాగునీరు దొరకకా చెన్నై వాసుల ఇబ్బందులు

SMTV Desk 2017-08-02 12:01:26  chennai, water problems, people, pundi, chenbarampakkam, pulal, Ponds

చెన్నై, ఆగస్టు 2 : దేశంలో ఒకవైపు భారీ వర్షాలు మరో తాగునీటి కష్టాలపై అతిశయోక్తి చోటుచేసుకుంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో చెన్నై వాసులకు నీరు దొరుకాక ఆవేదన చెందుతున్నారు. ఈ మహానగరానికి తాగునీటిని అందించే పూండి, చెంబరంపాక్కం, పుళల్ చెరువులు అడుగంటి పోవడంతో, ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాళ్ల క్వారీల్లో ఉన్న వర్షపు నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటి నిల్వలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. రోడ్ల మీద సైకిళ్లు, ఆటోలు, మూడు చక్రాల సైకిళ్లు నీళ్ల బిందెలతో వెళుతున్న దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి. బోర్లలో నీరు రాకపోవడంతో చెన్నైవాసుల కష్టాలు మరింత పెరిగాయి. దీంతో, మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేస్తున్న ట్యాంకర్లపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నీటి కోసం గొడవలు కూడా నిత్యకృత్యమై పోయాయి.