అర్జున్ రెడ్డిని ప్రశంసించిన ఎంపి కవిత

SMTV Desk 2019-02-06 09:58:58  Vijay Devarakonda, MP Kavitha, Forbes under 30

హైదరాబాద్, ఫిబ్రవరి 06: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకి ఇటీవల అరుదైన గౌరవం లభించింది. సినీ పరిశ్రమకు వచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ యంగ్ హీరో ఫోర్బ్స్ ౩౦ అండర్ ౩౦ లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఇందుకు గానూ నిజామాబాదు ఎంపి కవిత విజయ్ దేవరకొండను అభినందించారు. ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందిస్తూ ఫోర్బ్ద్ అండర్ ౩౦ జాబితాలో చోటు దక్కిన్చుకున్నదుకు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమలో మీ ప్రయాణం ఇలాగె ముందుకు సాగాలి. మీ తండ్రి ఆశయాన్ని నేరవేర్చినందుకు అభినందిస్తున్నాను. అని కవిత ట్వీట్ చేసారు.