కలిసి ఆడనున్న పాండ్య బ్రదర్స్

SMTV Desk 2019-02-06 08:54:50  Pandya brothers, Hardik pandya, Krunal Pandya, Baroda brothers, T20 match, NzvsInd T20

స్పోర్ట్ డెస్క్, ఫిబ్రవరి 06: ఈ రోజు న్యూజిలాండ్ తో జరిగే టీ-20 మ్యాచ్ లో ఇద్దరు అన్నదమ్ములని చూసే అరుదైన ఛాన్స్ వచ్చేలా వుంది. అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన కెరీర్ ను ప్రమాదంలో పడేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన సోదరుడితో కలిసి ఓ ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు. నేడు న్యూజిలాండ్ తో జరిగే టీ-20 మ్యాచ్ లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, యువ ఆటగాళ్లకు స్థానం ఇచ్చి చూడాలని జట్టు మేనేజ్ మెంట్ భావించింది. హార్దిక్ పాండ్యాతో పాటు అతడి సోదరుడు కృనాల్ పాండ్యాకు కూడా తొలి మ్యాచ్ లో అవకాశం దక్కింది. అయితే, భారత జట్టుకు ఇద్దరు సోదరులు ఆడటం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలో మొహిందర్ అమర్‌ నాథ్ - సురీందర్ అమర్‌ నాథ్, ఇర్ఫాన్ పఠాన్ - యూసఫ్ పఠాన్ లు ఆడగా, ఇప్పుడు వారి సరసన హార్దిక్ - కృనాల్ జత కలవబోతున్నారు. వీరిద్దరూ ముంబై ఇండియన్స్ తరఫున గత మూడు సంవత్సరాలుగా కలిసే ఆడుతున్నారన్న సంగతి మనకి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను గెలుచుకున్న ఆనందంలో ఉన్న భారత జట్టు, టీ-20 సిరీస్ ను కూడా గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది.