జాక్ పాట్ కొట్టిన హుషారు డైరెక్టర్...

SMTV Desk 2019-02-05 18:59:28  Vijay Devarakonda, Husharu Movie, Sree harsha Konuganti Director, Dear comrade

హైదరాబాద్, ఫిబ్రవరి 05: మొదటి సినిమా హుషారు తో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి. ఇప్పుడు తనకు తగ్గట్టుగా యూత్ ఐకాన్, యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా తీయబోతున్నాడని సమాచారం. రీసెంట్ గా విడుదలైన చిత్రం హుషారు యువత ను బాగా ఆకట్టుకుంది. ఆ విషయం తెలిసిన విజయదేవరకొండ శ్రీ హర్షను పిలిచి మరీ ఆ సినిమా చూసి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. దాంతో ఈ దర్శకుడి పరిస్దితి గాల్లో తేలినట్లు ఉంది. దేవరకొండ తో ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారట.





అయితే తన రెండో చిత్రాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేయటం మామూలు విషయం కాదు. అంతేకాక విజయ్ కూడా ఈ మధ్య ఎవ్వరితో కమిట్ అవ్వడంలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కనుక హిట్ అయితే మాత్రం ఆ దర్శకుడుకు తిరుగు ఉండదు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుబడనున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక హుషారు చిత్రం తమిళ , హిందీ భాషల్లో రీమేక్ కానుంది. ఈ చిత్రాలకు కూడా శ్రీ హర్ష నే డైరెక్ట్ చేయమని ఆఫర్ వచ్చిన ఆయన నో చెప్పేసి, దేవరకొండతో ముందుకు వెళ్తున్నారు.