'యాత్ర' పై ఆధారపడ్డ విశాల్, నాని మల్టీ స్టారర్...!

SMTV Desk 2019-02-05 18:22:35  Vishal, Nani, Yatra Movie, Mahi V raghav

హైదరాబాద్, ఫిబ్రవరి 05: వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'యాత్ర'. మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళం మెగాస్టార్ మమ్మూట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ మొన్నటివరకు బాగానే ఉన్న ఇప్పుడు పెద్దగా బజ్ క్రియేట్ చేయడం లేదు. ఈ సినిమా విడుదల అనంతరం ఈ సినిమా డైరెక్టర్ ఒక మల్టీస్టారర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కోలీవుడ్ హీరో విశాల్ - టాలీవుడ్ హీరో నానిలతో కలిసి ఈ కుర్ర దర్శకుడు ఇటీవల మంచి ఒక కాన్సెప్ట్ వినిపించాడు. స్క్రిప్ట్ పై ఇద్దరు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

అయితే మహి వి రాఘవకు ఇంకా ఫైనల్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. కథ బాగానే ఉన్నప్పటికీ డైరెక్టర్ టేకింగ్ విషయంలో విశాల్ కాస్త డౌట్ గా ఉన్నాడంటూ కోలీవుడ్ లో టాక్ వచ్చింది. ఇప్పుడు మహి వి రాఘవ యాత్ర సినిమాపై ఇద్దరు హీరోలు ఓ కన్నేసి ఉంచారు. ఈ సినిమా హిట్టయితే నాని, విశాల్ కథకు ఫుల్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. యాత్ర సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మమ్మూట్టి వైఎస్ పాత్రలో నటించిన ఈ సినిమా ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి మరి.