స్టొరీ సెలెక్షన్స్ లో రౌడి ఆట్టిట్ట్యుడ్...

SMTV Desk 2019-02-05 17:51:26  Vijay devarakonda, Top directors, Puri jagannad, Director Maruti, Taxiwala, Nota, Dear comrade

హైదరాబాద్, ఫిబ్రవరి 05: వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్ దేవరకొండకు బడా డైరెక్టర్ల నుండి ఆఫర్స్ వచ్చిన నో చెప్పేస్తున్నాడంట. నోట సినిమా కాస్త నిరాశపరచడంతో సినిమాలకు ఒకే చెప్పేముందు కాస్త జాగ్రత్తపడుతున్నాడంట. గతంలో చాలా మంది యువ హీరోలు టాప్ స్టేజ్ లోకి వెళ్లి ఒక్కసారిగా బొక్కబోర్ల పడ్డవారు ఉన్నారు. దీంతో విజయ్ కొత్త దర్శకులైనా కూడా కథ నచ్చి అతనిమీద ఓ నమ్మకం కలిగేవరకు ప్రాజెక్టులకు ఒకే చెప్పడం లేదు. రీసెంట్ గా మారుతి కూడా ఈ యువ హీరోను కలిసినట్లు తెలుస్తోంది. శైలజా రెడ్డి తో దెబ్బతిన్న ఈ కామెడీ దర్శకుడు రొటీన్ ఫార్మాట్ లోనే కథను చెప్పడంతో విజయ్ నచ్చలేదని మొహం మీదే చెప్పశాడట.

ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ముందు విజయ్ తో ఒక సినిమా చేద్దామని అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. పూరి బాండ్ స్క్రిప్ట్ తో రాకపోవడం వరుస ఫ్లాప్ లు ఉండడంతో విజయ్ చాలా అలోచించి నో చెప్పేశాడట. మరికొంత మంది సీనియర్ దర్శకులు కూడా దేవరకొండ తలుపుతట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ ముందు ఒకే చేసుకున్న ప్రాజెక్టులు ఓ కొలిక్కి వచ్చేవరకు మరో కథను ఓకే చేసే పని పెట్టుకోవద్దని ఈ రౌడీ హీరో కుదరదన్నాడట. ఈ విధంగా విజయ్ నోటా అనంతరం చాలా వరకు తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూనే సక్సెస్ కథలను పసిగడుతున్నాడు.