విక్రమ్ గౌడ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు...!

SMTV Desk 2017-08-02 11:20:43  VIKRAM GOUD ARRESTED

హైదరాబాద్, ఆగష్టు 2 : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో విక్రమ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. తన తండ్రి ముఖేష్ గౌడ్ నుంచి డబ్బును తీసుకోవాలన్న ఆలోచనతో స్వయంగా విక్రమ్ కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా విక్రమ్ తన మీద కాల్పులను జరిపే షూటర్స్ ను కూడా ఇండోర్ నుంచి తెప్పించుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు విక్రమ్ గౌడ్ ను అరెస్ట్ చేసారు. విక్రమ్ తో పాటు అతని స్నేహితులు ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. ఈ కాల్పుల కోసం ఉపయోగించిన తుపాకీని నిందితులు షేక్ పేట చెరువులో పడేయగా పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం, విచారణకు సహకరించక పోవడం తదితర సెక్షన్ల కింద విక్రమ్ పై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. వైద్య పరీక్షల తరువాత విక్రమ్ మెడికల్ గా ఫిట్ గా ఉన్నాడని నిర్ణయించుకున్న తరువాతే అరెస్ట్ చేశామని, అవసరమైతే అతనికి వైద్య సహాయాన్ని కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.