ఎస్పీబీ వ్యాఖ్యలపై జయసుధ కామెంట్స్....

SMTV Desk 2019-02-05 16:58:55  SP Balasubrahmanyam, Comments on tollywood heroins, Jayasudha

హైదరాబాద్, ఫిబ్రవరి 05: ప్రముఖ గాయకుడూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ మధ్య హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి. హీరోయిన్లు కావాలని ఆడియో ఫంక్షన్స్ కి పొట్టి బట్టలు వేసుకొచ్చి నిర్మాతలను ఆకట్టుకోవాలని చూస్తుంటారని ఆయన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. నటుడు నాగబాబు ఎస్పీబీ వ్యాఖ్యలు ఖండిస్తూ ఓ వీడియోనే వదిలాడు. అయితే అదే క్రమంలో ఎస్పీబీకి సపోర్ట్ చేసే వారి సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. సీనియర్ హీరోయిన్ జయసుధ.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పినదాంతో తప్పేముందని ఆయనకి మద్దతు పలికింది.

తను కూడా హీరోయిన్ గా ఉన్నప్పుడు మినీ స్కర్ట్ లు, పొట్టి దుస్తులు వేసుకున్నానని, కానీ అవన్నీ కేవలం వెండితెర వరకేనని, ఆడియో ఫంక్షన్ లకు మాత్రం పద్దతిగా వెళ్లేదాన్ని అంటూ గుర్తు చేసుకున్నారు. ఈ కాలం అమ్మాయిలకు డిజైనర్ సోకులు ఎక్కువ అవ్వడంతో ఈవెంట్ కి ఎలా రావాలో మర్చిపోతున్నారు అంటూ జయసుధ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీటిపై స్పందించిన కొందరు నెటిజన్లు కాలంతో పాటు వీళ్లు మారరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.