మొదటిసారి భారీ బడ్జెట్ సినిమాతో నాని...!

SMTV Desk 2019-02-05 16:50:10  Nani, Jersey movie, Gowtam, Natural star nani, Mallirava Fame director gowtam,Vikram director, Mythri movie makers

హైదరాబాద్, ఫిబ్రవరి 05: వరుస విజయాలతో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నానికి క్రిష్ణార్జున్న యుద్ధం తరువాత సరైన హిట్ తగల్లేదు. అలాగే ఈ మధ్య వచ్చిన దేవదాసు సినిమా కూడా కాస్త నిరాశపరచడంతో స్టొరీ ఎంచుకునే పద్దతిలో కాస్త కొత్తదనం చూపిస్తున్నాడు నాని. ప్రస్తుతం ఈ హీరో జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం నాని తాజా చిత్రం జెర్సి...35 కోట్లు బిజినెస్ చేస్తోంది. దాంతో అంత బిజినెస్ చేసేటప్పుడు నిర్మాతలు ఆగుతారా..అంతకు మించి బడ్జెట్ నాని మీద పెట్టడానికి సిద్దపడతారు. జెర్సి చిత్రం సెట్స్‌పై ఉండగానే విక్రమ్ కుమార్‌తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే వీరిద్దరి కాంబోలో గతంలోనే సినిమా రావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది మిస్ అయింది.

మళ్లీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. మార్చి నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రానికి ఇప్పటివరకూ నాని కెరీర్ లో పెట్టనంత బడ్జెట్ ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు యాభై కోట్ల బడ్జెట్ తో ఈచిత్రం రూపొందనుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇదే నాని కెరీర్ లో హైయిస్ట్ బడ్జెట్ కావటం విశేషం. ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఈ చిత్రానికి ప్రముఖ డీఓపీ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కాగా మార్చి 19 నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వ‌ర‌లోనే ఈచిత్రం యొక్క పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.