యూరీ ది సర్జికల్ స్ట్రైక్ ప్ర‌భంజ‌నం.

SMTV Desk 2019-02-05 16:44:27  URI The Surjical strike, Box office

భారత సైన్యం 2016లో చేసిన సర్జికల్ స్ట్రైక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన చిత్రం యూరీ. ఎలాంటి అంచ‌నాలు లేకుండా జ‌న‌వ‌రి 11న సైలెంట్‌గా ధియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే విడుద‌ల అయిన త‌ర్వాత రివ్యూస్ పాజిటీవ్‌గా రావ‌డం, మౌత్ టాక్ కూడా విప‌రీతంగా స్పెడ్ అవ‌డంతో.. అస‌లు ఆడ‌ద‌ని అనుకున్న సినిమా క్ర‌మ‌క్ర‌మంగా బాక్సాఫీస్ వ‌ద్ద పుంజుకుంటూ రికార్డులు కొల్ల‌గొట్టే దిశ‌గా దూసుకుపోతుంది.

ఉగ్రవాదుల దాడికి ప్రతికారంగా… పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ జరిగిన తీరును వెండితెర పై రోమాలు నిక్క‌బొడిచేలా స్క్రీన్ ప్లే ఉండ‌డంతో ఈ చిత్రం ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లని సాధించిందని స‌మాచారం. ఇప్ప‌టికీ మంచి వసూళ్లతో దూసుకుపోతూ.. ఈ ఏడాది బాలీవుడ్‌లో తొలి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది యూరి ది సర్జికల్ స్ట్రైక్. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన యూరి 200 కోట్ల వసూళ్లని సాధించడంతో పాటు శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతల చేతికి భారీ మొత్తంలో లాభాలు రానున్నాయ‌ని తెలుస్తోంది. అంతే కాకుండా రానున్న రోజుల్లో భారీ చిత్రాలు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఈ సినిమా వ‌సూళ్ళు 250 కోట్లు దాటే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు.